Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చండేగావ్ పాఠశాలకు బెంచీల వితరణ

చండేగావ్ పాఠశాలకు బెంచీల వితరణ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని చండే గావ్ గ్రామ ఎంపీపీ ఎస్ పాఠశాల విద్యార్థులకు గ్రామస్తులు దేవమరే హరిబా మంగళవారం  బెంచీలు గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా వితరణ చేయడం జరిగింది. డెస్క్‌లు మరియు బెంచీల విరాళం చండేగావ్ గ్రామంలోని విద్యార్థుల సౌకర్యార్థం దేవమరే హరిబా 6 డెస్క్‌లు మరియు బెంచీలను విరాళంగా అందించారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపయోగపడేలా ఈ విలువైన సహకారం అందించిన దేవమరే హరిబా కి గ్రామ సర్పంచ్ తో పాటు ఉపాధ్యాయురాలు మౌనిక , విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి దాతకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేశారు. “విద్యార్థుల భవిష్యత్తు కోసం మీ సేవ చిరస్మరణీయం.” గా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు, జీపీ కార్యదర్శి వికాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -