Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బైక్ దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

బైక్ దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మంగళవారం మద్నూర్‌ మండల కేంద్రంలో బైకు దొంగల ముఠాను ఎస్ ఐ ఏ మోహన్ రెడ్డి, పోలీస్ బృందం పట్టుకుని అరెస్టు చేసింది. ఎస్సై మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేగ్లూర్ గ్రామానికి చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాన్ లు కలిసి జల్సాలకి అలవాటు పడి, డబ్బుల కోసం దొంగతనాలు చేస్తుంటారని చెప్పారు. మద్నూర్, డోంగ్లి మండలలో దొంగతనం చేద్దామని ముందస్తు ప్రణాళికలో భాగంగా 28-07-2026 తెల్లవారుజామున 4 గంటలకి డోంగ్లి గ్రామంలో జాదవ్ దీపక్ ఇంటి కాంపౌండ్ గేట్ తాలాన్ని పగలగొట్టి ఇంటి ఆవరణలో ఉన్న బైక్ హోండా షైన్ BNo: TS 16 ET 7946ను పాతతాళంతో తీసి దొంగలించిన బండిని, హాండేకలూర్  గ్రామంలోని దేష్పెట్వర్ గంగాధర్  ఇంటి ముందు గల మరొక బైక్ HF deluxe BNO TS17C4311 బండిని దొంగలించి, భక్తపూర్ రోడ్ గుండా దేగ్లూర్ కి వెళ్ళారనీ, తిరిగి 17-08-2026న ఆ రెండు బండ్లను పిట్లం ,బిచ్కుంద ప్రాంతాల్లో అమ్ముదామని వెళ్తుండగా మార్గమధ్యలో మద్నూర్ శివారులోని పాత భారత్ పెట్రోల్ బంక్ దగ్గర మద్నూర్ ఎస్ ఐ మోహన్ రెడ్డి వారి బృందం విఠల్, శ్రావణ్, సంతోష్ లు కలిసి పట్టుకున్నామని చెప్పారు. అనంతరం రిమాండ్ కు తరలించామని ఎస్సై విలేకరులకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -