Tuesday, August 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇమ్రాన్ ఖాన్ ను ఆస్పత్రికి తరలించండి: పాకిస్థాన్ సుప్రీంకోర్టు

ఇమ్రాన్ ఖాన్ ను ఆస్పత్రికి తరలించండి: పాకిస్థాన్ సుప్రీంకోర్టు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) శ్రేణులకు పాకిస్థాన్ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్ కి తరలించాలని ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కట్టుదిట్టమైన భదత్రా కల్పించి చికిత్స అందజేయాలని పేర్కొంది. వారంలో ఒక్కసారి తప్పనీసరిగా కుటుంబసభ్యులతో కలిసే అవకాశాన్ని కల్పించాలని ఆదేశించింది.

2023 నుండి ఆగస్టు ఇమ్రాన్ అడియాలా జైలులో పలు సెక్షన్ల కింద శిక్షను అనుభవిస్తున్నారు. అప్పట్నుంచి ఆయన ఆరోగ్యం పట్ల ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, పీటీఐ నాయకులను కూడా ఆయనతో ములాఖాత్ కు అనుమతి ఇవ్వకపోవడంతో అనుమానాలు రేకెత్తాయి. పలుమార్లు పార్టీశ్రేణులు, కుటుంబసభ్యులు అడియాలా జైలు బయట ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా వచ్చే నెల సెప్టెంబర్ 17 లోపు ఇమ్రాన్ ఆరోగ్యంపై పూర్తి సమాచారం రాకపోతే లక్షమందితో అడియాలా జైలును ముట్టడిస్తామని పీటీఐ నేతలు పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాజాగా ఈక్రమంలోనే కోర్టు ఆదేశాలు వెలువడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -