Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం..

రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం..

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని మేనూర్‌ గ్రామంలో 161జాతీయ రహదారి బృందం ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్‌ అశోక్‌ పటేల్‌ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి, ప్రాణాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. హెల్మెట్‌, సీట్‌ బెల్టు, తప్పనిసరిగా ధరించాలనీ, వాహనాలను పరిమిత వేగంతో నడపాలనీ సూచించారు. సెల్‌ ఫోన్‌ డ్రైవింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ చేయరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో మేనూరు గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, 161వ హైవే అధికారి రాజ్ కుమార్, గేప్టీ మేనేజర్ మహినుద్దీన్, 161వ స్టాప్ మెంబర్స్, మేనూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -