Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
బహుజన గౌడ ముద్దుబిడ్డ, ధీరుడు, ప్రజా పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జుక్కల్ గౌడ సంఘం అధ్యక్షులు ఎమ్‌. లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సావిత్రి-సాయగౌడ్ మాట్లాడుతూ ..సామాన్య కుటుంబంలో జన్మించి, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. ఆనాటి సామాజిక అసమానతలను, అణచివేతను ఎదిరిస్తూ బహుజనులలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపిన గొప్ప పోరాట యోధుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు.

పాపన్న గౌడ్ జీవితం మనకు ఒక గొప్ప సందేశమనీ, అన్యాయాన్ని ఎదిరించాలనీ, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనీ, సమాజంలోని బలహీన వర్గాల కోసం నిలబడాలని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలి పిలుపునిచ్చారు. “బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక – సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి, సమాజ సేవా భావం నేటి తరానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయక” మన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జుక్కల్ గౌడ సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ జి. భాను గౌడ్, టి. సుదర్శన్ గౌడ్, ఎమ్‌. మారుతి గౌడ్, ఎమ్‌. శంకర్ గౌడ్, ఎమ్‌. రవి గౌడ్, ఎమ్. అశోక్ గౌడ్, జి. మహేష్ గౌడ్, జి. వినోద్ గౌడ్, జి. నవీన్ గౌడ్, టీ. కృష్ణ గౌడ్, డా. కృష్ణ గౌడ్, డా. లక్ష్మణ్ గౌడ్, కే. కృష్ణ గౌడ్, సీహెచ్‌. సతీష్ గౌడ్, ఎమ్‌. గాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -