నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణా మాలుంటాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరిం చారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్ జోక్యం చేసుకుని నాగేశ్వర్‌కు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ విశ్లేషకులు సమాజంలో జరిగే పరిణామాలను, తమకున్న సమాచారాన్ని బట్టి విశ్లేషించడం, ప్రజాబాహుళ్యంలో చర్యలు చేయడం సహజమైన విషయమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దనీ, భిన్నమైన అభిప్రా యాలుంటే చెప్పకూడదనే అహంకారంతో మేధావుల నోరు నొక్కేందుకు ఏపీలో అధికార కూటమి నాయకులు కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. విశ్లేషకులు ప్రజాసమస్యలపైనా, రాజకీ యాంశాలపైనా మాట్లాడితే వాటిని అర్థం చేసుకుని లోపాలను సరిదిద్దుకునే వైఖరితో వ్యవహరించాలిగానీ వ్యక్తిత్వంపై దాడి చేయడమేంటని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తామంటూ భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి నిరంకుశ వైఖరిని సీపీఐ(ఎం) ఏ మాత్రం సహించబోదనీ, నాగేశ్వర్‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు : సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



