Wednesday, May 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసోషల్‌ ‌మీడియాపై చర్యలు తీసుకోండి

సోషల్‌ ‌మీడియాపై చర్యలు తీసుకోండి

- Advertisement -

డీజీపీకి ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌ ‌ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ ‌కళ్యాణ్‌‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనను అరెస్ట్‌ ‌చేస్తారంటూ ప్రచారం చేస్తున్న సోషల్‌ ‌మీడియాపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా కొంత మంది సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారన్నారు. తనకు ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్టు నాగేశ్వర్‌ ‌తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -