- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జనసేన ఫిర్యాదుతో తనపై నమోదైన కేసులపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ స్పందించారు. 30 ఏండ్ల వయస్సులోనే దేనికీ భయపడలేదని, ఇప్పుడు 62 ఏండ్ల వయస్సులో అరెస్ట్‌లకు అస్సలు భయపడబోనని స్పష్టం చేశారు. తనపై కులం, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, అల్లర్లు రేపుతున్నారని తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. వాళ్లే కులాలు, ప్రాంతాల గురించి మాట్లాడారు తప్ప.. తననుంచి అలాంటి మాటలు రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
- Advertisement -



