- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ : బాల్కొండ మండల కేంద్రంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను బుధవారం అడిషనల్ చార్జ్ ఆఫీసర్ బట్టు రాజేశ్వర్ పరిశీలించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రతి ఇంటిని సందర్శిస్తూ, వారి నుంచి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని,ఎన్యూమరేటర్ లను ఆయన కోరారు. ఈ సందర్బంగా జనాభ గణకులు బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేష్ ఇంటికి వెళ్ళి వివరాలను సేకరించారు. ఈ జన గణన లో భాగంగా ప్రజల ఇంటికి వచ్చే గణకులకు గ్రామస్తులు పూర్తి సహకారం అందించాలని గ్రామ సర్పంచ్ రాజేష్ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ బోయడ నర్సయ్య, సాయన్న , నటరాజ్, తౌటు మధు తదితరులు ఉన్నారు.
- Advertisement -



