నవతెలంగాణ – తొగుట
ప్రతి సమస్యకు గడువులోపు పూర్తి చేయాలమి వివిధ శాఖల అధికారులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి అంటే కేవలం పనుల ప్రారంభం కాదు.. వాటి అమలుపై నిరంతర పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చేగుంట మండలంతో ప్రారంభమైన ఈ సమీక్షల పరంపర నేడు తొగుట వరకు చేరుకుని ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతులు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించమన్నారు. రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ పాలక వర్గం లేకపోవడంతో సర్పంచ్ లకు, అధికారులకు మధ్య జవాబుదారి తనం, పర్యవేక్షణ కరువైందని అన్నారు.
దుబ్బాకలో అమలవుతున్న ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించడం ఈ సమీక్షల ప్రత్యేకతను చాటుతోందని తెలిపారు. కొద్ది రోజుల క్రితం చేగుంట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో మండల సమస్యలపై సమీక్ష నిర్వహించిన అనంత రం పలు పంచాయతీ రాజ్ రోడ్ల మంజూరు గురుం చి మంత్రి సీతక్క ను కలశని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గం లో మండల వారీగా చేస్తున్న సమీక్షల గురుంచి మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నిజమే జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక వర్గాలు లేకపోవడంతో అధికారులు, సర్పంచ్ ల మధ్య దూరం పెరిగి పోయిందని, దుబ్బాక స్ఫూర్తి తో రాష్ట్రం అంతటా కార్యక్రమం లు నిర్వహిస్తామని ఈనెల 24న మంత్రి సీతక్క ఆదేశాలిచ్చారని, నియోజకవర్గంలో చేసిన ప్రయత్నం రాష్ట్రవ్యాప్తంగా అమలుకు కావడం హర్షనీయం అన్నారు.
45రోజులకు ఒకసారి మంగళవారం, బుధవారం రోజున ప్రతి మండలం లో సర్పంచ్ లు, అధికారులతో సమీక్ష నిర్వహిం చాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు గడువు విధిస్తూ, శాఖల మధ్య సమన్వయంతో పరిష్కారా నికి దిశానిర్దేశం చేస్తూ ప్రజాపాలనకు కొత్త ప్రమా ణాలను నెలకొల్పుతున్న దుబ్బాక మోడల్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. ప్రజలకు మరింత చేరువైన, జవాబుదారీ తనం కలిగిన పాలనకు ఈ సమీక్షలు నిదర్శనంగా నిలుస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతు న్నారని చెప్పారు. ఎమ్మెల్యే ముందస్తు పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాందారి నరేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ విజయ్ రెడ్డి, కాన్గల్ సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి, ఎంపీడీఓ పి వి నర్సింహారెడ్డి, సీఐ లతీఫ్, సర్పంచ్ లు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.



