Wednesday, July 29, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గడువులోగా ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి

గడువులోగా ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) పురోగతిని జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదై ఉంటే, వారిని సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకువచ్చేలా రేషనలైజేషన్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపట్టాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న పనులను గడువులోగా పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని, ఖచ్చితమైన ఓటరు జాబితాల తయారీలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ, జిల్లాలో ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 97.15 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో డిజిటలైజేషన్ వంద శాతం, ఆదిలాబాదు నియోజకవర్గంలో 98.15 శాతం పూర్తయిందని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియజేయడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అన్ని రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ పూర్తి పారదర్శకతతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఆర్.ఎస్. చిత్రు, డీఆర్‌వో స్రవంతి, ఆర్‌డీఓ జగదీశ్వర్ రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, ఇతర అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -