Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణిత శాస్త్ర అధ్యాపకురాలు కస్ప శ్రీలత కు డాక్టరేట్

గణిత శాస్త్ర అధ్యాపకురాలు కస్ప శ్రీలత కు డాక్టరేట్

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి (మర్కల్ ) నందు గణిత శాస్త్ర అధ్యాపకురాలుగా పని చేస్తున్న కస్ప శ్రీలత హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంకా శాస్త్ర విభాగం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివారెడ్డి షేరి పర్యవేక్షణలో నానో ద్రవాలు, హైబ్రిడ్ నానో ద్రవాలు అయస్కాంత ద్రవగతి  ప్రవాహ విశ్లేషణ  అనే అంశం పై పరిశోధన చేసి, పరిశోధన గ్రంధాన్ని సమర్పించినందుకు గాను గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి, అధ్యాపక బృందం శ్రీలతను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -