మహనీయుల ఆశయాలు విద్యార్థులకు స్ఫూర్తి
ఎంఎస్ఎన్ ఫార్మా ఫౌండర్ చైర్మన్ ఎండీ, యాదాద్రి బోర్డు చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి
నవతెలంగాణ-నవాబు పేట
నవాబ్‌పేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహంతో పాటు సావనీర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఎంఎస్ఎన్ ఫార్మా ఫౌండర్ చైర్మన్ ఎండీ యాదాద్రి బోర్డు చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు,ఉపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ,మహనీయుల జీవితాలు విద్యార్థులకు ఆదర్శప్రాయమని,వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగ్యనాయక్,టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జహీర్ అక్తర్,మాజీ డీసీసీ అధికార ప్రతినిధి దుశ్యంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం, వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాణెం సుధాకర్ మాజీ అధ్యక్షుడు రాంచంద్రయ్య సర్పంచ్ గీతారాణిసుధాకర్ చారి ఉప సర్పంచ్ హజహర్ అలీ, కోట్ల రాజేష్,నవాజ్ రెడ్డి వాసు వెంకటేష్ గౌడ్ భూపాల్ రెడ్డి,నర్సింహులు చిర్ప సత్యం బంక వెంకటయ్య మైనోద్దీన్ నీలకంఠ రాజశేఖర్ అంబాదాస్ నాయక్ ఉమర్, మాజీ ప్రజాప్రతినిధులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెన్నకిష్టయ్య ధశరథ్ నాయక్ మరికంటి రాములు,రవిశంకర్ యాదయ్య శ్యాం సుందర్ రెడ్డి ,విద్యార్థులు, తల్లిదండ్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




