- Advertisement -
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లిలో అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రేంజ్ కార్యాలయం నుంచి సత్తుపల్లి పాత సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి అటవీ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. రేంజర్ సిహెచ్ఎల్ఐ మాట్లాడుతూ… పులుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అంతేకాకుండా అడవులను, వన్యప్రాణులను సంరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ వేణుమాధవ్, ఎఫ్ఎస్ఓ లు అరుణ్ కుమార్, భాస్కర్ రమేష్, కొండారెడ్డి, నాగరాజు వైల్డ్ లైఫ్ ఎక్స్ పర్ట్ రామాయన్, మైనార్టీ కళాశాల ప్రిన్సిపల్ కత్తి వెంకటరామయ్య పాల్గొన్నారు.
- Advertisement -



