Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందించాలి: సర్పంచ్

విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందించాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మల్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని ఆ గ్రామ సర్పంచ్ అమృత్వాలు శ్రీకాంత్ మంగళవారం సందర్శించారు. ఈ క్రమంలో ఆయన పాఠశాలలో, అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ప్రభుత్వ పరంగా అందించే భోజనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పిల్లలకు అంగన్వాడి పిల్లలకు ప్రభుత్వ నిబంధనాల ప్రకారం నాణ్యమైన భోజనాలు అందించాలని సూచించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనములో పాల్గొని విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. సర్పంచ్ పాఠశాల, అంగన్వాడి కేంద్రాల సందర్శన పట్ల గ్రామస్థులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -