Friday, May 29, 2026
E-PAPER
Homeజాతీయంవిజయన్‌ ఇంటిపై ఈడీ దాడులకు

విజయన్‌ ఇంటిపై ఈడీ దాడులకు

- Advertisement -

వ్యతిరేకంగా చెన్నైలో సీపీఐ(ఎం) నిరసన
చెన్నై : కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఇంటిపై ఈడీ దాడులకు వ్యతిరేకంగా గురువారం చెన్నైలో సీపీఐ(ఎం) నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సెంట్రల్‌‌ చెన్నై జిల్లా కార్యదర్శి జి సెల్వా ఈడీ దాడులను తీవ్రంగా ఖండించారు. ఈడీ దాడులను, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ అరెస్టును తమిళనాడు ప్రభుత్వం ఖండించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నాయని ఆయన విమర్శించారు. వామపక్ష పార్టీలకు, అందునా సీపీఐ(ఎం)పై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ దాడులు జరిగాయని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -