Saturday, May 30, 2026
E-PAPER
Homeజాతీయంజూన్ 3న డీకే శివ‌కుమార్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం

జూన్ 3న డీకే శివ‌కుమార్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాంగ్రెస్ అధిష్టానం సూచనతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య శుక్రవారం సాయంత్రం సీఎం ప‌దవీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. డీకే శివ‌కుమార్ నాయ‌క‌త్వంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు కానుంది. అదే విధంగా ఆయ‌న ప్ర‌మాణస్వీకారానికి ముహుర్తం ఖ‌రారు అయింది. జూన్ 3న ఆ రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు. ప్రమాణ స్వీకార వేడుకను బెంగళూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ శ్రేణులు భారీగా తరలిరానున్నాయి. పార్టీ సీనియర్ నేతలతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -