Saturday, May 30, 2026
E-PAPER
Homeబీజినెస్ఇందిరమ్మ ఇండ్లే రెఫరెండం

ఇందిరమ్మ ఇండ్లే రెఫరెండం

- Advertisement -

సవాల్‌‌ను స్వీకరించే దమ్ముందా?
కేటీఆర్‌‌కు 
మంత్రి పొంగులేటి ప్రశ్న

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇందిరమ్మ ఇండ్లే రిఫరెండమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సవాల్ ను స్వీకరించే దమ్ముందా లేదా?అని కేటీఆర్‌‌ను ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే దమ్ము లేక హైదరాబాద్ లో ఇండ్ల మీద పడ్డారని తెలిపారు. అదే హైదరాబాద్‌లో ఇండ్ల అంశంపై సవాల్ చేస్తే ఆ సవాల్ ను స్వీకరించే ధైర్యం లేక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చేతల ప్రభుత్వం కాబట్టే చిత్తశుద్ధి, సత్తా ఉన్నాయి కాబట్టే రెండున్నర ఏండ్లలోనే గ్రామాల్లో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించామని వివరించారు. వచ్చేనెల ఒకటిన మరో 2.5 లక్షల ఇండ్ల నిర్మాణాలను ప్రారంభిం చబోతున్నామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో తొలి విడతలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబో తున్నామని పేర్కొన్నారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీలో బీజేపీ నేతల ముందు మోకరిల్లింది కేటీఆర్‌ అని ఆరోపిం చారు. ఈ విషయం స్వయంగా ప్రధాని మోడీ, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, కల్వకుంట్ల కవిత ప్రస్తావిం చారని గుర్తు చేశారు.

కేసుల మాఫీ కోసం కాషాయ నేతల కాళ్లు పట్టుకున్న కేటీఆర్‌‌కు పౌరుషం గురించి మాట్లాడే అర్హత లేదని తెలిపారు. దళిత ముఖ్యమంత్రి నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల వరకు అన్నీ మాటలు తప్ప, చేతలు ఎక్కడైనా ఉన్నాయా?అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాల గురించి కేటీఆర్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ధరణి దందాలు, బినామీల బాగోతాలు, రియల్ ఎస్టేట్ అక్రమాలు జరిగాయని వివరించారు. 2014 కు ముందు కేటీఆర్‌ ఆర్థిక పరిస్థితి ఏమిటీ? పదేండ్లు అధికారంలో ఉండి విచ్చల విడిగా ఎలా దోచుకున్నారో ప్రజలం దరికీ తెలుసని పేర్కొన్నారు. గ్రామాల్లో వారు పదేండ్లలో కట్టిన ఇండ్ల కంటే, కేవలం రెండున్నర ఏండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువ ఇండ్లు నిర్మించిందని వివరించారు. హైదరా బాద్ లో ఇండ్ల నిర్మాణంపై మరోసారి సవాల్ విసురుతు న్నానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో కట్టిన ఇండ్ల కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తేనే, ఎన్నికల్లో పోటీ చేస్తా?అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే పోటీకి కేటీఆర్‌ దూరంగా ఉంటారా? దమ్ముం టే సవాల్ ను స్వీకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -