అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్
నవతెలంగాణ – చండూరు
ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపల్ పట్టణంలో పళ్ళు వార్డులలో జరిగిన రోడ్ షో లో ఆయన పాల్గొని 4వ వార్డు ఇరిగి వెంకటమ్మ రామన్న, 5వ వార్డు గుండ్రెడ్డి మధుతో కలిసి మల్లన్న గుడి దగ్గర నుండి లేపాక్షి కాలనీ, రాజీవ్ కాలనీ, అంగడిపేట ఎల్లమ్మ గుడి దగ్గర వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 3వ వార్డు సామ సుజాత యాదవ రెడ్డి, 9వ వార్డు గుంటి పద్మ వెంకటేశంతో కలిసి ఎన్టీఆర్ కాలనీ మీదుగా వినాయక మండపం, తాసీల్దార్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు.
10వ వార్డు అభ్యర్థి సతీష్ తో కలిసి కోట మైసమ్మ దేవాలయం నుండి గల్లీలో గడపగడపకు తిరుగుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తాను గత ప్రభుత్వంలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేస్తే, ఇప్పుడు వచ్చి నేనే లైట్లు వేశా, నేనే రోడ్లు వేశా అని గొప్పలు చెప్పుకుంటూ కొబ్బరికాయ కొట్టుకుంటూ శిలాఫలకాలు వేస్తున్నాడే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయని విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అమృత్ పథకం కింద తాను మంజూరు చేయించిన రూ.12 కోట్లల్లో ఇంకా రూ.6 కోట్ల నిధులు మున్సిపాలిటీలో మరుగుతున్నట్లు తెలిపారు. ఆ నిధులు విడుదల చేయించి మున్సిపాలిటీ అభివృద్ధి చేసే దమ్ము ధైర్యం లేదన్నారు.
మున్సిపాలిటీలో మిగిలిపోయిన అన్ని పనులను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కోడి బ్రదర్స్ కు మున్సిపాలిటీ అప్పజెప్పడం కోసం ఆరాట పడుతున్నారని, కోడి బ్రదర్స్ కు పాఠశాలల మీద ఉన్న ప్రేమ మున్సిపల్ అభివృద్ధిపై ఉండదన్నారు. వాళ్ల పాఠశాలల వల్ల ఇక్కడికి మోడల్ స్కూల్ గాని, ఇంటిగ్రేటెడ్ పాఠశాల తేవడం లేదన్నారు. కావున బీఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, ఇరిగి రామకృష్ణ, నకిరికంటి రామలింగం, చొప్పరి దశరథ, బూతురాజు వెంకన్న, బొమ్మరబోయిన వెంకన్న, మాజీ అధ్యక్షుడు పెదగొని వెంకన్న గౌడ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు సంగేపు సువర్ణ, మండల మహిళా అధ్యక్షురాలు పెండ్యాల గీత, గోపిడి వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



