నవతెలంగాణ-బెజ్జంకి: మండలంలోని అయా గ్రామాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అదివారం మండల పరిధిలోని వడ్లూర్ గ్రామంలోని అంబేడ్కర్ యువజన సంఘం అధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని అణచివేసే యత్నం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వాలకు అంబేడ్కర్ వాదులు తగిన గుణపాఠం చెప్పాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాసూరి మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు.