Friday, February 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుత్వరలో పామాయిల్ ఫ్యాక్టరీలు ప్రారంభిస్తాం: మంత్రి తుమ్మల

త్వరలో పామాయిల్ ఫ్యాక్టరీలు ప్రారంభిస్తాం: మంత్రి తుమ్మల

- Advertisement -

నవతెలంగాణ – కంటేశ్వర్ 
పామాయిల్ సాగులో దేశంలోనే తెలంగాణ ముందుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. నిజామాబాద్  రూరల్ పరిధిలో గల కేశపూర్ ప్రాంతంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పామాయిల్ సాగులో దేశంలోనే తెలంగాణ ముందుందని అన్నారు. పామాయిల్ సాగులో నిజామాబాద్ జిల్లాను ముందుంచుతామని తెలిపారు. ఈ జిల్లాలోనూ త్వరలో పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మిస్తామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేశామన్నారు. సన్న ధాన్యం పండించిన రైతాంగానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. 13 వేల కోట్లు ఖర్చుపెట్టి సన్నబియ్యం ప్రజలకు అందిస్తున్నామన్నారు.

ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు. ఉచిత కరెంటు, ఉచిత బస్సు, సబ్సిడీ సిలిండర్లు ఇలా ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తున్నామని రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలను ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తప్పకుండా ప్రజల మాటకు కట్టుబడి పని చేస్తున్నామన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -