Saturday, February 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయూనిక్‌ కాన్సెప్ట్‌

యూనిక్‌ కాన్సెప్ట్‌

- Advertisement -

డైరెక్టర్‌ వెంకీ కుడుముల ‘ఇట్లు అర్జున’తో నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు, వాట్‌ నెక్స్ట్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై ఇది అతని మొదటి వెంచర్‌. ‘న్యూ గై ఇన్‌ టౌన్‌’ అనీష్‌ హీరోగా మహేష్‌ ఉప్పల దర్శకత్వంలో, అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అక్కినేని నాగార్జున వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన టైటిల్‌ గ్లింప్స్‌తో ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది. అనిష్‌ పుట్టిన సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌, వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. పోస్టర్‌లో అనీష్‌ కూల్‌ అండ్‌ చార్మింగ్‌గా కనిపించారు. కొత్తగా విడుదలైన వీడియోతో మేకర్స్‌ ఆ పాత్ర వెనుక ఉన్న యాక్టర్‌ పై ఫోకస్‌ చేశారు. ఫైండింగ్‌ అర్జున వాల్యూమ్‌ 1 వీడియో ఒక క్యారెక్టర్‌ను పరిచయం చేయడమే కాదు, ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళడానికి అనీష్‌ చూపించిన కమిట్‌మెంట్‌ మైండ్‌సెట్‌ను ఆవిష్కరిస్తుంది. అర్జున్‌ మూగవాడు, సంభాషణలపై ఆధారపడకుండా, పూర్తిగా బాడీ లాంగ్వేజ్‌, ఎమోషనల్‌ డెప్త్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిన పాత్ర ఇది.

కొత్త నటుడికి ఇది ఒక పెద్ద సవాలు. కానీ అనీష్‌ దీన్ని ఒక సవాలుగా కాకుండా, తన నటనా పరిధిని విస్తరించుకునే అవకాశంగా స్వీకరించిన తీరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆడిషన్‌ సమయంలోనే అనీష్‌ టీమ్‌ను ఇంప్రెస్‌ చేయడం, పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత కూడా అదే ఉత్సాహంతో ముందుకు రావడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అతడు ప్రత్యేకంగా ప్రిపరేషన్‌ దశను దాటాడు. అర్జున్‌ ఎమోషనల్‌ జర్నీని లోతుగా అధ్యయనం చేయడం, షూటింగ్‌కి ముందే పాత్రను ఇంటర్నల్‌గా స్వీకరించడం… ఇవన్నీ అతని కమిట్‌మెంట్‌ను చాటి చెబుతున్నాయి. ఫైండింగ్‌ అర్జున వాల్యూమ్‌ 1 అనీష్‌ను మరో డెబ్యూ నటుడిగా మాత్రమే కాదు తన కళపై ఉన్న నిజాయితీని, నటన ద్వారానే తనను తాను నిరూపించుకోవాలనే తపనను ప్రజెంట్‌ చేస్తోంది. ఈ చిత్రానికి ఎస్‌ తమన్‌ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని రాజా మహదేవన్‌ నిర్వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -