- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని డోంగ్లి మండలంలోని మల్లాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ తెలిపారు. డోంగ్లి మండల మల్లాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు లబ్దిదారులకు సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాపూర్ గ్రామ సర్పంచ్ అమృత్వర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అవసరమైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



