లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ తో మన ముందుకు వస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అహల్యా బమ్రూ మీడియాతో ముచ్చటించారు. మాది పుదుచ్చేరి. నేను ఎప్పుడూ యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తుంటాను. నాగ్ అశ్విన్ నా కంటెంట్ చూసి ఈ సినిమా గురించి చెప్పారు. నా ఆడిషన్ కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఇచ్చాను (నవ్వుతూ). అలా ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇది సంగీతం నేపథ్యంలో ఉండే సినిమా. నాకు పాటలు పాడటం, గిటార్ వాయించడం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇది నాకు తెలుగులో మంచి ఆరంభం అవుతుందని అనుకున్నాను. ఈ ప్రాజెక్ట్‌కు ఎంపిక అవ్వడం నా అదృష్టం. సింగీతం దర్శకత్వం, నాగ్ అశ్విన్ నిర్మాణం, వైజయంతి మూవీస్ బ్యానర్ అనగానే మరో ఆలోచన లేకుండా అంగీకరించాను. సింగీతం శ్రీనివాసరావు అద్భుత మైన దర్శకుడు. ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంటుంది. సింగీతం తీసిన చిత్రాలన్నీ కూడా కాలానికి ముందు న్నవే. ఇది కూడా అలాంటి సినిమానే.
ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్ ఇది. 94 ఏళ్ల వయసులో కూడా ఇంత మోడ్రన్ ఆలోచనతో సినిమా చేయడం ఆయనకే సాధ్యం. సింగీతం పాత్రలను ఎంత అద్భుతంగా రాస్తారో అందరికీ తెలుసు. ఆయన సినిమాల్లో మహిళా పాత్రలు చాలా బలంగా, స్వతం త్రంగా ఉంటాయి. ఇందులో నా పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇది సాధారణ క్లాసికల్ హీరోయిన్ పాత్ర కాదు. నా పాత్రకు తనకు ఏమి కావాలో స్పష్టమైన అవగాహన ఉంటుంది. చాలా బలమైన వ్యక్తిత్వం కలిగిన పాత్ర. ఇందులో విలన్ పాత్ర కూడా ఒక అమ్మాయే చేస్తోంది. ఇది చాలా అరుదైన విషయం. ఈ కథ యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన “ఏమైంది ఏమైంది”, “హలో బాసు” పాటలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి చాలా ప్రత్యేకమైన సంగీతాన్ని అందిం చారు. నా పాత్ర మాత్రమే కాదు కథ, పాటలు చాలా యూనిక్‌గా ఉంటాయి. నాకు యాక్షన్ సినిమాలు చేయడం చాలా ఇష్టం. భవిష్యత్తులో అలాంటి పాత్రలు చేయాలని కోరుకుం టున్నాను.
యూనిక్ క్యారెక్టర్ చేశా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



