Thursday, June 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅమీర్ పేట్‌లో అగ్ని ప్రమాదం

అమీర్ పేట్‌లో అగ్ని ప్రమాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమీర్ పేట్‌లోని మైత్రీవనం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. గురువారం మెయిన్ రోడ్డుపైనే ఉన్న KSR ఫ్యాషన్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. క్షణాల్లోనే మంటలు బిల్డింగ్ అంతటా వ్యాపించాయి. సమీప దుకాణాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ భారీ అగ్ని ప్రమాదంతో అమీర్ పేట్ మొత్తం నల్లటి పొగ అలుముకుంది. పొగ దట్టంగా కమ్మేయడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. KSR ఫ్యాషన్స్ షాపులో అన్నీ దుస్తులు కావటంతో మంటల స్థాయిలో తీవ్రంగా ఉందంటున్నారు అధికారులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -