Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలి

ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలి

- Advertisement -

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. మల్లేష్ 
నవతెలంగాణ – అచ్చంపేట
గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలని, ఏడాదిలో 200 రోజులు పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ మల్లేష్ డిమాండ్ చేశారు. మంగళవారం అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు ప్రశాంత్ నగర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలను వారి పని ప్రదేశాన్ని సందర్శించారు. కూలీలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడారు.

కూలీలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వి బి జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని అన్నారు. కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్ ల ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న జరగబోయే సారవత్రిక సమ్మెలో కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు బాలయ్య, నరసింహ, పర్వతాలు, ఉపాధి హామీ కూలీ లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -