Wednesday, February 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయూకే ప్రధాని రేసులో షబానా

యూకే ప్రధాని రేసులో షబానా

- Advertisement -

‘ఎప్‌స్టీన్‌’ ఫైళ్ల వివాదంతో
రాజకీయ సంక్షోభం
ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..?

లండన్‌: ఎప్‌స్టీన్‌ ఫైళ్ల వివాదం బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒకవేళ స్టార్మర్‌ వైదొలిగితే యూకే తదుపరి ప్రధానిగా ఎవరు ఎన్నికవుతారనే దానిపై చర్చ మొదలైంది. ఈ రేసులో మహిళా ఎంపీ షబానా మహ్మద్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్‌ చరిత్రలోనే పాక్‌ మూలాలు ఉన్న తొలి ముస్లిం ప్రధానిగా షబానా నిలవనున్నారు.

ఎవరీ షబానా..?
షబానా మహ్మద్‌ ప్రస్తుతం స్టార్మర్‌ ప్రభుత్వంలో హోం మంత్రిగా కొనసాగుతున్నారు. 45 ఏండ్ల షబానా 2010 నుంచి బర్మింగ్‌హామ్‌ లేడీవుడ్‌ స్థానానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వత్తిరీత్యా బారిస్టర్‌ అయిన ఆమె.. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో లేబర్‌ పార్టీలో చేరారు. అనతికాలంలోనే పార్టీలో ఉన్నత పదవులకు చేరుకున్నారు.

తన పార్లమెంట్‌ కెరీర్‌లో షాడో క్యాబినెట్‌లో స్థానం సాధించారు. యూకేలో ప్రభుత్వ మంత్రిమండలి నిర్ణయాలను పరిశీలించడం కోసం ప్రతిపక్షం ఏర్పాటుచేసుకునే సొంత క్యాబినెట్‌ను షాడో క్యాబినెట్‌గా పిలుస్తారు. లేబర్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో షాబానా జస్టిస్‌ సెక్రెటరీ, షాడో ఎడ్యుకేషన్‌ సెక్రెటరీగా వ్యవహరించారు. 2025లో లేబర్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమె హోం మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు.
బ్రిటన్‌కు వలసవచ్చిన పాకిస్తానీ దంపతులకు 1980లో షబానా జన్మించారు. లేబర్‌ పార్టీలో బలమైన నేతగా ఇప్పటికే ఆమెకు పేరుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్మర్‌ వైదొలగాల్సివస్తే.. పార్టీ పగ్గాలు అందుకునేందుకు ఆమె సమర్థవంతమైన నాయకురాలని లేబర్‌ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
లైంగిక నేరాల నిందితుడు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్న పార్టీ సీనియర్‌ నేత మాండెల్సన్‌ను అమెరికాలో రాయబారిగా నియమించిన ప్రధాని కీర్‌ స్టార్మర్‌ పదవీగండాన్ని ఎదుర్కొంటున్నారు. ఎప్‌స్టీన్‌ ఫైళ్ల వ్యవహారం వెలుగులోకి రాగానే మాండెల్సన్‌ను పదవి నుంచి తొలగించినా స్టార్మర్‌పై విమర్శలు ఆగడం లేదు. ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో తాను చివరివరకు పోరాడుతానని ప్రధాని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. ప్రధానిగా స్టార్మర్‌ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నరే అయిం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -