- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ జడ్పీ హైస్కూల్‌లో ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి బయల్దేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని ఢిల్లీ వెళ్లనున్నారు.
మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వార్డు పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాలలోని హైటెక్‌సిటీలో 227వ నంబర్ పోలింగ్ బూత్‌లో మంత్రి వివేక్ ఓటు వేశారు.
- Advertisement -



