Wednesday, April 15, 2026
E-PAPER
Homeక్రైమ్విద్యుదాఘాతంతో కోళ్ల ఫామ్ దగ్ధం 

విద్యుదాఘాతంతో కోళ్ల ఫామ్ దగ్ధం 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర  
విద్యుదాఘాతంతో కోళ్ల ఫాం దగ్ధమైన సంఘటన మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత రైతు పల్లపు సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిలో 30 గుంటల్లో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాను. మరో వారం రోజులు కోడి పిల్లలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో కోళ్ల ఫామ్ లో ఉన్న విద్యుత్ కనెక్షన్ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగి కోళ్లఫామ్ కు అంటుకున్నాయి. అది గమనించిన స్థానికులు బాధిత రైతు పల్లపు సమ్మయ్యకు సమాచార అందించారు. అయితే అప్పటికే కోళ్ల ఫారం అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -