Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవభారతానికి స్ఫూర్తి అంబేద్కర్

నవభారతానికి స్ఫూర్తి అంబేద్కర్

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా, పట్టణంతోపాటు, జాగిర్యాల్ గ్రామంలో జై భీమ్ మాల సంఘం మరియు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పంచశీల జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆలోచనలు, సిద్ధాంతాలు సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -