నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా పులిచెర్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల గడ్డితో మురుగునీటితో నిండిపోయింది. పైస్లాబ్, వరండా పిల్లర్లు కూలి పోయి ప్రమాద స్థితికి చేరుకుంది. తరగతి గదులన్నీ ఊచలు తేలి ఎప్పుడు కూలి పోతుందోనని,గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.అంతే గాక తరగతి గదుల గోడలు నల్లగా మారి, గబ్బిలాలు మరియు ఇతర కీటకాలు తిరుగుతున్నాయి.పాఠశాల లో మౌలిక వసతులు లేకపోవడం,పాఠశాల ఆవరణము అపశుభ్రంగా ఉందని ఈ నెల 9న నవతెలంగాణలో వచ్చిన కథనానికి గ్రామపెద్దలు,యువకులు,గ్రామ పాలక వర్గం,పూర్వపు విద్యార్థులు గ్రామానికి చెందిన బుడిగపాక సత్యనారాయణ, బుడిగ పాక లక్ష్మణ్,
ఖమ్మంపాటి అంజి, మోర మల్లయ్య అంతా కలిసి విరాళాలు సేకరిస్తున్నారు. బుధవారం పులిచర్ల మాజీ సర్పంచిగా సేవలు అందించిన మూడావత్ బాలాజీ నాయక్ పాఠశాల అభివృద్ధి కొరకు రూ. 6000/- లు పులిచర్ల గ్రామానికి చెందిన విద్యుత్ శాఖలో హెల్పర్ గా మొదలుకొని అంచలంచలుగా ఎదిగి లైన్ ఇన్స్పెక్టర్ గా రిటైర్మెంట్ అయిన ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థి మహమ్మద్ రహీం రూ. 4000/- విరాళంగా అందించారు.
పులిచర్ల పాఠశాల మరమ్మతులకు విరాళాలు సేకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



