- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాజకీయ సంక్షోభం తర్వాత బంగ్లాదేశ్‌లో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7:30 గంటలకు ఓటింగ్ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు వేయనున్నారు. సాయంత్రం 4:30 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. 5 లక్షల మంది సిబ్బంది పేపర్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. గురువారం రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి.మొత్తం 300 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అభ్యర్థి మరణంతో ఒక స్థానంలో పోలింగ్ నిలిపివేశారు. మిగతా 299 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1 మిలియన్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
- Advertisement -



