- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌లో అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీకి ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.4ను ఉల్లంఘించినందుకు నబీ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడీ చేతికి ధరించిన రిస్ట్‌బ్యాండ్ విషయంలో నబీ అంపైర్లను ప్రశ్నించారు. ఈ మ్యాచ్ రెండు సూపర్ ఓవర్ల వరకు ఉత్కంఠభరితంగా సాగి, చివరకు దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
- Advertisement -



