Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బైండ్ల సంఘ భవనం ప్రారంభం

బైండ్ల సంఘ భవనం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
ప్రభుత్వ సహకారం వారికీ అన్ని విధాలుగా సహకారం అనిస్తామని కాంగ్రెస్ పార్టీ మండ ల అధ్యక్షులు అక్కం స్వామి అన్నారు. గురువారం మండలంలోని ఘనపురం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దయతో బైండ్ల సంఘం నాయకుల సహకారంతో స్థలాన్ని కొనుగోలు చేసి భవనాన్ని నిర్మించుకున్నారు. భవనాన్ని సంఘం సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బైండ్ల సంఘం నాయకులు స్థలాన్ని కొనుగోలు చేసి భవ నాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరం అన్నారు.

భవనానికి బైండ్ల రాజయ్య, బైండ్ల బుచ్చిరాజు, బైండ్ల నర్సింలు, బైండ్ల యాద గిరి, బైండ్ల పరశురాములు, బైండ్ల రామ స్వామిల సహకారంతో భవనాన్ని నిర్మించి నట్లు తెలిపారు. బైండ్ల సంఘం భవన నిర్మా ణానికి సహకరించిన దాతలు అందరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో తన వంతు సహాయ సౌకర్యాలు మరిన్ని అందజేస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ప్రారంభానికి వచ్చిన అతిథులను శాలువాతో సన్మానిం చారు. తెలంగాణ బైండ్ల సంఘం కోశాధికారి అనిమేళ్ల రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైండ్ల సంఘానికి సహకారం అందించారని తెలిపారు.

అమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా మండల, గ్రామ ప్రజలపై ఉండాలని, పాడి పంటలు సమృద్ధి గా పండాలని వేడుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు తమను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను ప్రవే శ పెట్టి తమ ఎదుగుదలకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మరుపల్లి పరు షరాములు గౌడ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -