Wednesday, June 10, 2026
E-PAPER
Homeఆటలుచివర్లో సంచలనం

చివర్లో సంచలనం

- Advertisement -

ఇండియా-ఎను గెలిపించిన యువ పేసర్
గైక్వాడ్ సెంచరీ,తిలక్ వర్మ అర్ధ సెంచరీ

దంబుల్లా : శ్రీలంక పర్యటనలో భారత్-ఎ జట్లు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 278 పరుగుల ఛేదనలో శ్రీలంక-ఎ6వికెట్ల నష్టానికి 262పరుగులతో గెలుపుకు చేరువైన జట్టును ఇండియా-ఎ బౌలర్లు ఫలితం తారు మారు చేశారు.టీమిండియా-ఎ బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో లంకజట్టు మరో 7పరుగుల్లోపే చివరి 4వికెట్లు కోల్పోయి ఆలౌట్ కాగా..ముక్కోణపు టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది.డంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఎ8పరుగుల తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది.తొలుత బ్యాటింగ్‌ కు దిగిన భారత్‌..  రుతురాజ్‌ గైక్వాడ్‌ (101)సూపర్‌ సెంచరీకి తోడు కెప్టెన్‌ తిలక్‌ వర్మ (60)బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50ఓ‍వర్లలో6వికెట్ల నష్టానికి 277పరుగులు చేసింది.ఇన్నింగ్స్‌ ఆఖర్లో ఆయుశ్‌ బదోని (24),సూర్యాంశ్‌ షేడ్గే (26నాటౌట్‌)మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించారు.ఐపీఎల్‌2026తర్వాత భారీ అంచనాలతో బరిలోకి దిగిన సూర్యవంశీ 14పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.లంక బౌలర్లలో మొహమ్మద్‌ షిరాజ్‌2వికెట్లు తీయగా..కరుణరత్నే,సంకేత్‌,వనుజ సహాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.అనంతరం278పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక,సాహన్ అరచ్చిగే (74),నిరోషన్ డిక్వెల్లా (47),సమరవిక్రమ(46)రాణించడంతో ఓ దశలో (262/6)గెలుపు దిశగా దూసుకెళ్లింది.అయితే చివరి రెండు ఓవర్లలో (7పరుగుల వ్యవధిలో)  కేవలం10పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి269పరుగులకే ఆలౌటై,ఓటమిపాలైంది.అర్షద్ ఖాన్,ఆయుష్ బదోని,అనుకూల్‌ రాయ్‌,విప్రాజ్‌ నిగమ్‌ తలో రెండు వికెట్లు తీయగా,అన్షుల్‌ కంబోజ్ ఓ వికెట్‌ పడగొట్టారు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గైక్వాడ్ కు దక్కింది. 11న జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్‌-ఏ,ఆఫ్ఘనిస్తాన్‌-ఏ తలపడనున్నాయి. 

స్కోర్ బోర్డు…
ఇండియా-ఎ ఇన్నింగ్స్:ప్రభ్ సిమ్రన్ సింగ్ (సి)సమరవిక్రమ(బి)కరుణరత్నే2,సూర్యవంశీ(సి)సహన్(బి)షిరాజ్14,ప్రియాన్ష్ ఆర్యా (రనౌట్)ఫెర్నాండో/డిక్వెల్లా32,గైక్వాడ్(సి)ఫెర్నాండో(బి)సహన్101,తిలక్ వర్మ (బి)షిరాజ్60,ఆయుస్ బడోనీ (ఎల్ బి)గరుక సంకేత్ 24,సుయాన్ష్ షిండే (నాటౌట్) 26, అనుకుల్ రాయ్ (నాటౌట్) 1, అదనం17. (50 ఓవర్లలో6వికెట్ల నష్టానికి) 277 పరుగులు.
వికెట్ల పతనం: 1/16, 2/16, 3/69, 4/219, 5/225, 6/271
బౌలింగ్: కరుణరత్నే7-1-46-1,షిరాజ్9-0-67-2,సంకేత్8-0-49-1,ఫెర్నాండో8-0-38-0,వనుజ సహాన్ 10-0-35-1,సహన్ అరఛింగే 4-1-18-0,విశ్వకాంత్4-0-23-0

శ్రీలంక-ఎ ఇన్నింగ్స్: డిక్వెల్లా(సి)అనుకుల్ రాయ్ (బి)బడోనీ47,ఫెర్నాండో(సి)సూర్యవంశీ(బి)బడోనీ45,నువాందు ఫెర్నాండో (స్టంప్)ప్రభ్ సిమ్రన్ సింగ్ (బి)విప్రాజ్8,సదీరా(సి)సుయాంశ్ షిండే (బి)అనుకుల్ రాయ్ 46,సహన్(బి)కంబోజ్74,రవీందు(సి అండ్ బి)అనుకుల్ రాయ్ 1,ఛమీకా(సి)బడోనీ(బి)విప్రాజ్9,వనుజ(రనౌట్)గైక్వాడ్23,విజయ్ కాంత్ (ఎల్ బి)అర్షాద్5,షిరాజ్(సి)విప్రాజ్(బి)ఆర్షాద్0,సంకేత్(నాటౌట్) 0, అదనం11. (48.5ఓవర్లలో ఆలౌట్) 269 పరుగులు.
వికెట్ల పతనం: 1/93, 2/99, 3/109, 4/187, 5/195, 6/237, 7/262, 8/269, 9/269, 10/269
బౌలింగ్: కంబోజ్6-0-47-1,అర్షాద్ ఖాన్ 4.5-0-24-2,అనుకుల్ రాయ్ 10-1-49-2,సుయాంశ్ షిండే 8-0-41-0,ఆయుశ్ బడోనీ 10-0-46-2,విప్రాజ్8-0-46-2,తిలక్ వర్మ 2-0-15-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -