Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలో పలువురు ఆత్మీయుల కుటుంబాలను గురువారం రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఉప్లూర్ తాజా మాజీ ఎంపీటీసీ సభ్యుడు, బిఆర్ఎస్  నాయకులు పిప్పేరా అనిల్ సతీమణి వినోద కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అనిల్ ను,  వారిని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. వినోద అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులోనే వినోద అకాల మరణం చెందడం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన కుటుంబ సభ్యులకు  తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఉప్లూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు చిలుకూరి మారుతి, చిన్నాన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో  వారిని, కుటుంబ సభ్యులను ప్రరామర్శించారు.చౌట్ పల్లి  గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సభ్యుడు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏశాల నర్సయ్య తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించారు.  నర్సయ్యను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేశారు.

చౌట్ పల్లి గ్రామానికి చెందిన మీ సేవ మోహన్ తల్లి ఇటీవల మృతి వారి కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, సర్పంచ్ మహబూబ్, మాజీ సర్పంచులు గడ్డం స్వామి, మారు శంకర్, నవీన్ గౌడ్, సంత రాజేశ్వర్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -