Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ మహిళ సమాఖ్య భవనాలు మంజూరు

గ్రామ మహిళ సమాఖ్య భవనాలు మంజూరు

- Advertisement -

ఎంపీడీవో పెరుమాళ్ళ జ్ఞాన ప్రకాష్ రావు
నవతెలంగాణ – కట్టంగూర్

మండలంలోని 12 గ్రామ పంచాయితిలలో నూతన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు మండల అభివృద్ధి అధికారి పెరుమాళ్ళ జ్ఞాన ప్రకాష్ రావు తెలిపారు. గురువారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.12 గ్రామాలలో భవన నిర్మాణాల కొరకు స్థలాన్ని గుర్తించామని ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున  రూ.1 కోటి 20 లక్షల ఉపాధి హామీ నిధులు మంజూరైనట్లు తెలిపారు.

మండలంలోని బొల్లేపల్లి, చెరువు అన్నారం, దుగినేల్లి, ఈదులూర్, గార్లభాయి గూడెం, ఇస్మాయిల్ పల్లి, కలిమెర, కురుమర్తి , మల్లారం, ముత్యాలమ్మ గూడెం, పరడ, పిట్టంపల్లి గ్రామాలలో భవనాల కొరకు స్థల సేకరణ పూర్తయిందని త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన గ్రామాలలో స్థల సేకరణ పూర్తయ్యాక రెండో విడత లో నిధులు మంజూరవుతాయని వివరించారు. సమావేశంలో  మండల పంచాయితీ అధికారి  కె. స్వరూప రాణి, ఏపి ఓ కడెం రామ్మోహన్, ఏపిఏం డి. రాములు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -