- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ను ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. బుధవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు నటరాజన్. తన రాజ్యసభ నామినేషన్ పత్రాల తిరస్కరణను సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సదురు పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదించనున్నారు.
- Advertisement -



