- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఆకస్మికంగా మారింది. రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- Advertisement -



