నవతెలంగాణ-హైదరాబాద్: సిరియా దేశంలో 14 ఏళ్లుగా కొనసాగిన అంతర్యుద్ధానికి సంబంధించిన కేసులో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఆయన సోదరుడు మహేర్ అసద్‌కు సిరియా కోర్టు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఇదే కేసులో అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారని నిర్దారణ కావడంతో ఆ దేశ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడే సమయంలో కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
2014 డిసెంబర్‌లో తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించిన తర్వాత బషర్ అసద్, ఆయన సోదరుడు మహేర్ రష్యాకు పారిపోయారు. ఆ తర్వాత అతేఫ్ నజీబ్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనపై విచారణ చేపట్టారు. అసద్ ప్రభుత్వంలో విచారణకు గురైన అత్యున్నత స్థాయి అధికారుల్లో నజీబ్ ఒకరిగా ఉన్నారు.నజీబ్ సిరియా సైన్యంలో మాజీ బ్రిగేడియర్ జనరల్. 2011లో బషర్ అసద్ పాలనలో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్‌లో రాజకీయ భద్రతా విభాగానికి ఆయన అధిపతిగా పనిచేశారు. అక్కడ తిరుగుబాటును అణచివేసిన చర్యల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.



