Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ 90.29 శాతం పూర్తి

ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ 90.29 శాతం పూర్తి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: జుక్కల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియ డిజిటలైజేషన్ ఈ నెల 10వ తేదీతో ముగిసిందని, నియోజకవర్గ పరిధిలో 90.29 శాతం పూర్తయినట్లు అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మద్నూర్ తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ ఒక ప్రకటనలో తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది మండలాలు ఉండగా, వీటి పరిధిలో 255 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఎస్‌ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియకు ముందు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,06,343గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి అయిన సందర్భంగా ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో ఓటర్ల సంఖ్య 1,86,311గా ఉన్నట్లు ఎం.డి. ముజీబ్ తెలిపారు.

మండలాల వారీగా ఎస్‌ఐఆర్ నమోదు శాతం ఇలా ఉంది: బిచ్కుంద 87.36 శాతం, పిట్లం 88.738 శాతం, మహమ్మద్ నగర్ 90.63 శాతం, పెద్ద కొడప్ గల్ 90.676 శాతం, జుక్కల్ 91.234 శాతం, మద్నూర్ 91.77 శాతం, డోంగ్లి 92.812 శాతం, నిజాంసాగర్ 93.392 శాతం. ఈ విధంగా ఎస్‌ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తయినట్లు అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.డి. ముజీబ్ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -