Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ జాతిపిత, ఉద్యమ నాయకుడు, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి వేడుకలను హుస్నాబాద్ లో మండల చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం మార్కండేయ దేవాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని తెలిపారు.

స్వాతంత్ర్యం అనంతరం ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో ఆయన కీలకంగా పాల్గొన్నారని గుర్తుచేశారు.చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. బాపూజీ ఆశయాలను కొనసాగిస్తూ చేనేత రంగం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండలం పద్మశాలి సంఘం అధ్యక్షుడు బూర్ల రాజయ్య, పట్టణ అధ్యక్షుడు కోమటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొండ సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్ కొండ రజిత, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరమణ చేనేత కార్మిక సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -