నవతెలంగాణ-ఆలేరు రూరల్
కబడ్డీ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–20 బాలుర కబడ్డీ ఎంపికల్లో ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. పాఠశాల విద్యార్థులు బైరి చండీశ్వర్, తుపాకుల మనోజ్ కుమార్ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు.ఎంపికైన విద్యార్థులు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొలనుపాక ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్,ఉపాధ్యాయ బృందం ఎంపికైన విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కొలనుపాక విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



