నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో సర్పంచ్ జూకంటి అనిల్ మరియు హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దాసి శంకర్ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ వారి సహకారంతో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ఈ హెల్త్ క్యాంపు నిర్వహించామని ప్రజల సహకారంతో ప్రతి ఆరు నెలలకు ఓసారి హెల్త్ క్యాంపు నిర్వహిస్తామని అన్నారు.ఈ హెల్త్ క్యాంప్ లో అనేక రకాల వ్యాధులకు మందులను పంపిణీ చేయడం జరిగింది.ఈ క్యాంపు కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూపల్లి అక్షయ రాజు,వార్డు మెంబర్లు బండి రమేష్,జన్నే రవి,కవిడే మహేందర్,కల్లెపు సుభాష్,చేనేత సహకార సంఘం డైరెక్టర్ అందే రాములు, మాజీ కార్యదర్శి ఎలగందుల రామఋషి టంగుటూరు గ్రామస్తులు వందలాదిమంది ఈ మెగా హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు.
టంగుటూరులో మెగా హెల్త్ క్యాంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



