Thursday, June 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుట్రోల్స్ పై సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన నటి హేమ

ట్రోల్స్ పై సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన నటి హేమ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బెంగళూరు రేవు పార్టీ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు, ట్రోల్స్ పై నటి హేమ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక హైకోర్టు తనపై నమోదైన కేసును కొట్టివేసి, డ్రగ్స్ పరీక్షల్లో నెగటివ్ వచ్చినప్పటికీ కొందరు సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతున్నారని ఆమె తెలిపారు. దీనిపై పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసినట్లు, ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కుని తప్పుడు కథనాలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె గురువారం హెచ్చరించారు. తనపై ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -