- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలను హైకమాండ్ అప్పగించింది. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే బాధ్యతలను ఆమె స్వీకరించారు. స్థానిక సమస్యలపై అధికార పక్షాలను గట్టిగా నిలదీసేలా ప్రణాళికలను రచించడంతో పాటు, క్షేత్రస్థాయి నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చేలా సమన్వయం చేయనున్నారు.
- Advertisement -



