నవతెలంగాణ-కుభీర్
మండలంలోని పార్డి (బి), డోడర్నా గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోళ్లు ఉప కేంద్రాన్ని గురువారం స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతుల వద్ద దళారులు తక్కువ ధరకు పంటను కొని వారిని మోసం చేస్తున్నారని అన్నారు. ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతు నష్టపోవద్దనే ఉద్ధేశ్యంలో నేడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం రూ.3700 మద్దతు ధర కల్పిస్తుందన్నారు. గ్రామంలోని రైతులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడి ప్రవీణ్, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు, బి సంతోష్, ఐకేపి, సి ఏ లు సాయినాథ్, రమేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



