- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లోని న్యాయవాది ఖాజా మోహిజుద్దీన్ హత్య కేసులో నాంపల్లి పోలీసులు మహ్మద్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్ లను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. చంచల్గూడ జైలు నుండి వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, సుపారీ ఇచ్చి న్యాయవాదిని హత్య చేయించిన తండ్రీకొడుకులను విచారించనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మెహబూబ్ ఆలం ఖాన్ ఉన్నాడు.
- Advertisement -



