– సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి శీలం
– సత్తుపల్లిలో ఏచూరి 74వ జయంతి వేడుక
నవతెలంగాణ – సత్తుపల్లి
దేశంలో లౌకిక, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు, సామాజిక న్యాయ సాధనకు సీపీఐ(ఎం) అగ్రనేత సీతారాం ఏచూరి చేసిన కృషి చిరస్మరణీయమని సీపీఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక రావి వీర వెంకయ్య ప్రజాసంఘాల భవనంలో బుధవారం జరిగిన సీతారాం ఏచూరి 74వ జయంతి వేడుకలలో
సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏచూరి చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో సత్యనారాయణరెడ్డి మాట్లాడారు. ఏచూరి జీవితాంతం కార్మికులు, రైతులు, పేదల హక్కుల కోసం పోరాడారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, సీనియర్ నాయకులు మోరంపూడి వెంకటరావు, చావా రమేష్, ఎస్కే వలి, భాస్కర్, జిలానీ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
లౌకిక, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ‘ఏచూరి’ కృషి చిరస్మరణీయం
- Advertisement -
- Advertisement -


