Wednesday, September 2, 2026
E-PAPER
Homeజాతీయంజస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభియోగాలు రుజువు : పార్లమెంటరీ ప్యానెల్‌

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభియోగాలు రుజువు : పార్లమెంటరీ ప్యానెల్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై నమోదైన అభియోగాలు రుజువయ్యాయని పార్లమెంటరీ విచారణ కమిటీ బుధవారం తేల్చింది. న్యాయమూర్తుల విచారణ చట్టం కింద సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ మేరకు నివేదిక సమర్పించింది. యశ్వంత్‌ వర్మ ఇచ్చిన వివరణ తప్పించుకునే ధోరణితో కూడినదిగా, అసంతృప్తికరంగా ఉందని కమిటీ పేర్కొంది. ఆయన అధికారిక నివాసంలోని స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు లభించడానికి కారణం, ఆ నగదుపై యాజమాన్యం తదితర అంశాలపై ఆయన సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారని తెలిపింది. విచారణలో భాగంగా నమోదు చేసిన కార్యకలాపాల రికార్డులు, పత్రాలు, సాక్ష్యాలు, ఇతర సంబంధిత అంశాలతో కూడిన నివేదికను కమిటీ సమర్పించింది. లోక్‌సభ, రాజ్యసభ ప్రధాన కార్యదర్శులు బుధవారం తమ తమ సభల్లో నివేదికను ప్రవేశపెట్టారు. నివేదిక రెండు భాగాలుగా ఉందని, ఇందులో విచారణ సందర్భంగా నమోదు చేసిన మౌఖిక, పత్రాధార సాక్ష్యాలను కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది.

2025 మార్చి 14న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పే సమయంలో ఆయన నివాసంలోని స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదును గుర్తించారు. అనంతరం ఆయన 2026 ఏప్రిల్‌లో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో పార్లమెంటులో కొనసాగుతున్న తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -